I know in this day of emails and instant communication, we dont depend on post man to be our means of communicatin, but circa 1959, he was the one guy who the whole village knew.
Here is a poem from Tilak's collection titled "Amrutam Kurisina Ratri". Telugu font works with IE. If you need the lines in RTS, mention that in comments section and I can post in english. Enjoy!
తపాళా బంట్రోతు "మైడియర్ సుబ్బారావ్
కనిపించడం మానేశావ్
యేవిటీ - పోస్టుమాన్ మీద గేయం వ్రాయాలా?
అందమైన అమ్మాయి మీద కాని
చందమామ మీద కాని
వంద్యుడైన భగవంతుడి మీదకాని అ
వంద్యుడైన ధీర నాయకుడు మీద కాని
పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్థే
యెక్కడి పోస్టుమానో యీ గోల
యీ సాయంత్రం వేళ
ధనవంతుడిని స్తుతి చేస్తే
పది డబ్బులు రాలుతాయి
సచివోత్తముణ్ణి స్మరిస్తే
పదికళ్ళు మన మీద వాలుతాయి
ఈ నీ ప్రార్ధన కడుంగడు అసభ్యం సుబ్బారావ్
ఉత్త పోస్టుమాన్మీద ఊహలు రానేరావు
మూడవ పంచవర్ష ప్రణళిక
యేడవ వన మహోత్సవ దినం
బిర్లా దాల్మియా
సినిమా దలైలామా
యుద్ధం పరమార్ధం
రాజులూ రాజ్యాలూ, తారుమార్లూ
ఇటువంటివి చెప్పు
మరి చూడు నా తడాఖా
మౄదు మాధ్వీ పదలహరీ
తరంగ మృదంగ విలసద్బంగీ
మనోహరాలౌ కావ్యాల్ గేయల్
కొల్లలుగ వ్రాస్తాను
కానీ, తపాళా బంట్రోతు మీదా
హవ్వ!
ఎండలో వానలో
ఎండిన చివికిన
ఒక చిన్న సైజు జీతగాడు
చెవిలో పెన్సిల్
చేతిలో సంచీ
కాకీ దుస్తులూ
అరిగిన చెప్పులు
ఒక సాదా పేదవాడు
ఇంటింటికీ
వీధివీధికీ
ప్రతిరోజూ తిరిగేవాడు - ప్రిమ్మినిస్టరా ఎం
అయితే చూడు
ఆ కితికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళూ
ఆ వీధి మోగువైపు ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు
ఆ కళ్ళలో ఆతృత
ఆ గుండెల్లొ గడిచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్తకోసం
అమ్మాయీ!
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి
పళ్ళేరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే
నీ ఆశ నాకు అర్ఠమయింది
అందుకే
నీ చూపుల తుమ్మెద బారులు కట్టి
నీ కోర్కెలు గజ్జలవలె ఘలంఘలించి
వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి
వీధి వీధినంతా కలయచూస్తున్నాయి
అడుగో పోస్టుమాన్!
ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు
అతని మొహంమీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు
వెల్లిపోతున్న తపాళా బంట్రోతు వెనుక
విచ్చిన రెండు కల్ హర సరస్సులు
గుడిసెముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడిగట్టిన ప్రాణపు దీపంలో
తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం
కోసం నిరీక్షణ
క్షణ క్షణ ప్రతీక్షణ
ఒకకార్డు ముక్క వ్రాశాడా
బంట్రోతు వెళ్ళు వెళ్ళూ త్వరగా
ముసలిదానికి మంచివార్త నందించు
ముడతలు పడిన మొహంమీద ఆనందాన్ని పరికించు
దూరభారాన ఉన్న కుమారుని కోసం
వగచే తల్లికి
చేరువచేరువౌతున్న నువ్వొక ఊరట
దగ్గరదగ్గరౌతున్న మిత్రుని లేఖకోసం
నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట
వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి
ఉద్యోగ శప్తుదైన నవీన యక్షునికి
మనిషికి రాక్షసునికి
నువ్వు
దూరల దూరాల్ని విచిత్రంగా
ఒకే నిముషము
అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి - కూర్పరివి
అదృస్టాద్వంమీద నీ గమనం
శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మేజిక్ సంచీలో
నిట్టూర్పులు నవ్వులు పువ్వులు
ఆనందాలు అభినందనలు ఏడుపులు
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!
కొందరికి పరిచయమైన నువ్వు
కొందరికి తలపరికించిన నువ్వు
కొన్ని వైపులకి చూడనే చూడవు
అందరికీ నువ్వు ఆప్తబంధువువి
అందరికి నువ్వు వార్త నందిస్తావు
కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం
అవుతూంటుంది
ఇన్ని ఇళ్ళు తిరిగినా
నీ గుండిబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకి చూడదు
ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న నౌక చప్పుడు!
****** - తిలక్ *********