Ismail Kavitha - రాయి (raayi)
రాయి
పలకరిస్తే పలకడు
కనీసం కళ్ళు విప్పి చుడడు
దువ్వి బుజ్జగిస్తే
నవ్వనే నవ్వడు
రువ్వితే ఉండిపోతుంది
రివ్వున తిరిగి రాడు
ఎన్నాళ్ళు స్నేహం చేసినా
నిన్ను గుర్తు పట్టడు
పనికి మాలింది!
అని అనుకున్నాను, కాని
ఇవాళ తెలిసింది
దీనికీ మనసుందని
ఎండలో పడుకోబెడితే
ఎంత వెచ్చబడుటుందీ !
సూర్యుడు దీని ప్రియుడు.