Coach P : what the fcuk!

You really want to know? Huh,huh, huH!

Sunday, August 27, 2006

Happy Vinayaka Chaviti wishes to all

I wish everyone a hassle free year, where Ganesha takes care of all the obstacles, while all you gotta do is maintain your sanity and drive on speed limits. Everything else will be taken care of if you say "Ganapati bappa mOriya". Greetings!!

On this eve, I want to present a nice little telugu story (non telugu readers can skip from here on) - from Satyam Sankaramanchi's collection of works titled, "Amaravati kathalu". It was such coincidence too that when clock stuck 12 last night, the story that I happened to read this one. I didnt want to rob you of that joy...,
"maa bojja ganapayya,
nee bantu nenayya,
undralla meedaki,
dandu pampu" :)

*
అంతా సామిదే! నేనెవర్ని ఇవ్వడానికీ?

తెల్లవారితే వినాయక చవితి.

పొద్దుపొడవకముందే వూరి జనమంతా గుళ్ళొకొచ్చి పడ్డారు పత్రి కోసుకోటానికి. తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చిన ధరణికోట జనం కూడా అందులో వున్నారు.

"తలుపులు తియ్యండో" అని గోల.

కొందరు ప్రాకారం గోడమీదకెక్కి వాటిమీంచి మారేడు చెట్లు ఎక్కి పత్రి కోయటం మొదలెట్టారు.

తలుపులు తీయటమేమిటి "హో" అని జన సముద్రం గుళ్ళొకొచ్చి పడ్డది. మారేడుచెట్లు, గన్నేరు చెట్లు సరసర ఎక్కి పత్రి, ఆకులు దూసేస్తున్నారు. మారేడుకాయలు గుత్తులు గుత్తులుగా తెంపుతున్నరు. పిల్లలు ఓ చెట్టునించి మరో చెట్టూకు పాకిపోతూ ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్కచేయక దళాలు కోస్తున్నారు. పృఆకరమంతా మారేడుదళాల సుగంధం, గన్నేరు పువ్వుల పరిమళం.

పదేళ్ళ సాంబడికి పట్టలేనంత సంబరంగా ఉంది. క్రిందటి సంవత్సరం వినాయక చవితికి యజమాని ఇంట్లో వినాయకపూజ జరుగుతుంటే గుమ్మంలో నుంచుని చూసాడు. వాళ్ళంతా పట్టుబట్టలు కట్టుకుని దేవుదికి పూజచేస్తూ హారతి ఇస్తుంటె తనకీ పూజ చేసుకోవలనిపించింది. ఎలా? వినాయకుడు లేడు. పూలు లేవు. పత్రి లేదు. అందుకని సరాసరి గుళ్ళోకి పరిగెత్తికొచ్చి ఎవరూచూడకుండా గుళ్ళో వినాయకుడి పాదాలమీద రెండు పూలు స్వయంగా పెట్టి మొక్కి వెల్లిపోయాడు. ఈ సంవత్సరం ఎలాగైనాసరే తన గుడిసెలో వినాయకుడికి పూజ చేసుకోవలని నిస్చయించుకుని తెల్లవారు జామునే స్నానంచేసి వచ్చి పత్రి, పూలు కోస్తున్నాడు.

'కొమ్మలు విరవకండ్రా' అని ఎవరో పిల్లల్ని అదిలిస్తున్నారు.

తెల్లవారేసరికి సాంబడు చాలా పత్రి కోసాడు. జమ్మి ఆకులు, గన్నేరు మొగ్గలతో ఒడి నింపుకున్నాడు, ఒడి చాలకపోతే పరుగెత్తుకు ఇంటికివెళ్ళి పత్రంతా ఇంట్లో పీటమీద పోసి మళ్ళీవఛ్ఛి పున్నాగపూలు కోసుకున్నాడు.

తెల్లవారేసరికి చెట్ట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్క ఆకు కూడ మిగలలేదు. ఒక్క పువ్వు మిగలలేదు. అన్ని పూలు స్వామి సేవకోసం వెల్లిపోతే చెట్లు బోసిపోతున్నయి. జనం తగ్గిపోయారు. కొందరు గడ్డి వెతుక్కుంటూ గరిక, చంద్రకాంతపూలు, రేగు ఆకులూ ఏరుకుంటుంటే వాళ్ళవెంటే ఉండి సాంబడు కూడా ఆ పూలన్నీ సేకరించాడు.

పత్రి సంపాదించతమైతే అయింది. మరి వినాయకుడో? బజారుకు పరుగెత్తుకెళ్ళి మట్టి వినాయకుణ్ణి చేసి అమ్మేచోట ఎదురుగా కూర్చున్నాడు, జనం వరుసగా వినాయకుడి బొమ్మలని కొనుక్కెళుతుంటే మళ్ళీ అచ్చుపోసి కొత్తవి తయారు చేస్తున్నాడు రంగయ్య. ఎదురుగా కూర్చున్న సాంబడితో "కాస్త సాయం చేయరా నీకో పావలా డబ్బులిస్తాను" అన్నాడు రంగయ్య. దాంతో సాంబడు పనిలోకి దూకాడు. మట్టి పిసికాడు. తనూ అచ్చులు పోసాడు. కళ్ళు దిద్దాడు. ఎందరెందరో వినాయకులు తన చేతిమీంచి పూజకి వెళ్ళీపోతుంటే పొంగిపోయడు. పదకుండు గంటలైంది. రంగయ్యకి బేరం కూడా తగ్గిపోయింది.

'ఇదిగోర నీ పావలా' అని డబ్బివ్వబోయాడు రంగయ్య. 'డబ్బులొద్దు నాకో వినాయకుణ్ణివ్వండీ' అన్నాడు సాంబడు. 'ఓరి భడవా' అంటు రంగయ్య ఓ పెద్ద వినాయకుణ్ణి చేసి ఇచ్చాడు. సాంబడి కళ్ళు సంతోషంతో వెలిగాయి! ఆ వినాయకుడితో పరుగుపరుగున ఇంటికొచ్చి కృష్ణకెళ్ళి మళ్ళి తలస్నానం చేసి వచ్చి పీటమీద ముగ్గులేసి వినాయకుడి పూజకు కూర్చున్నాడు. పూజ ఎలా చెయ్యాలో తెలిసింది కాదు. ఏ పత్రి ముందుంచాలో అంతకంటే అర్థమవలేదు.

యజమాని ఇంట్లొ మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటినాధారం చేసుకుని తనూ పూజ మోదలెట్టాడు. "అగరొత్తులు వెలిగించండి" అని వినిపిస్తే ఉత్తుత్తి అగరొత్తి వెలిగించేవాడు. "గన్నేరు పూలు పూజ చేయండి" అంటే ఆ పూలతో పూజ.

ఇలా పూజ సాగిపోయింది. పూజ ఆఖరున "కుడుములు, పాయసాలు, పళ్ళు, ఫలహారాలు నైవేద్యం పెట్టండి" అని వినిపించింది.

సాంబడికి నివేదన పెట్టడానికి ఎమిలేదు. కళ్ళనీళ్ళు తిరిగాయి. ఎదురుగా పెద్దవినాయకుడు. పత్రిలో మునిగిపోయి "నాకు నివేదన పెట్టవ?" అని చూస్తున్నట్లనిపించింది. తల్లి, యజమాని ఇంత్లో గిన్నెలూ అవీ కడిగిగాని రాదు. కుండల్లొ యేదన్న ఉందేమో అని వెతికి చూసాడు. ఖాళీ. "దేవుడికి ఎం పెట్టాలి?" అని గిలగిల్లాడిపోయాడు. దేవుడికి ఆకలేస్తున్నత్లనిపించింది సాంబడికి. ఎంచేయాలో తోచక వెక్కివెక్కి ఎడ్చాడు. ఏడ్చి ఏడ్చి వినాయకుడి పాదాల దగ్గిర పత్రిలో తలపెట్టుకుని పడుకొన్నాడు.కొంత సేపటికి తల్లి గుడిసెలోకి వస్తూ "సాంబా" అని పిలిస్తే ఉలిక్కి పడి లేచాడు. "ఇదిగో వినాయకుడి పెసాదం" అని యజమాని ఇంట్లో ఇచ్చిన వడపప్పు సాంబడి చేతిలో పెట్టింది.

సాంబడి ముఖం విచ్చుకుంది. దేవుడికి పెట్టడానికి ఎదో దొరికింది. వినాయకుది దగ్గరికి పరుగెత్తుకెళ్ళి "నీ నైవేద్దానికి దిరికింది సామీ!" అంటూ ఆ వడపప్పు వినాయకుడికి తినిపించాడు. చూస్తున్న తల్లి అంది. "పిచ్చి నాన్నా! సామి పెసాదం సామికే పెదత్నావా?" అని.
*

1 Comments:

Anonymous Anonymous said...

man!!i love amaravathi kadalu!!they are awesome.pls keep posting.btw where did u get the collection.

-krishna

8/28/2006 11:11 PM  

Post a Comment

<< Home