గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ..
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింత సేపు!
*********************
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ;
*********************
కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ;
*********************
యీడుండమంటాది యిలు దూరిపోతాది,
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ;
*********************
మందో మాకో యెట్టి మరిగించినాదీ,
వల్లకుందామంటే పాణ మాగదురా!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ;
*********************